Saturday, 19 February 2022

            గుంటూరు లో  భూ రాక్షసులు



తీగ లాగితే డొంకంతా కదులుతున్నట్టు గా గుంటూరు నగరం లో  వక్ఫ్ భూములు ఆక్రమణల వ్యవహారం తారాస్థాయికి చేరింది అని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్  ఆరోపించారుఅధికారాన్ని అడ్డం పెట్టుకొని వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేసేందుకు  రాజకీయ భూ రాక్షసుల ప్రయత్నాలు చెయ్యడం మానుకోవాలన్నారు.ప్రజలకు చెయ్యాల్సిన అభివృద్ధి మరిచి అక్రమాలకు పాల్పపడటం మంచి పద్దతి కాదన్నారు.నగరం లో సుమారు 2000 ల గజాలు స్థలం పై రాజకీయ భూ రాక్షసుల కన్ను పడిందన్నారు.వక్ఫ్ భూములను కాపాడేందుకు ప్రజల తరపున పోరాడుతామన్నారు.ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు ,గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్  నసీర్ గారు మరియు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గోన్నారు.